తలైవా ఊచకోత.. తెలుగులో భారీ తొలిరోజు వసూళ్లు సాధించిన రజినీ చిత్రాలు..

12 September 2023

12.5 కోట్లు మొదటి రోజు వసూళ్లుతో మొదటి స్థానంలో ఉన్న చిత్రం  2.0. ఈ చిత్రం రజినీ రోబో చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కింది.

9.3 కోట్లుతో కబాలి రెండో స్థానంలో ఉంది. కబలిడా అంటూ వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.

ఇక మూడో స్థానంలో తాజా బ్లాక్ బస్టర్ జైలర్ ఉంది. రజినీ మాస్ నటనతో పూనకాలు తెప్పించిన ఈ చిత్రం  7.01 కోట్లు రాబట్టింది.

ఈ జాబితాలో దర్బార్ చిత్రం నాలుగో స్థానంలో ఉంది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 4.52 కోట్లు తొలిరోజు కలెక్షన్ సాధించింది.

కాలా చిత్రం ఐదో స్థానంలో ఉంది. మొదటిరోజు 3.35 కోట్లు కలెక్ట్ చేసిన ఈ చిత్రం రజినీ అభిమానులకు నిరాశను మిగిల్చింది.

వీటిలో 2.55 కోట్లుతో ఆరో స్థానంలో నిలించింది లింగా మూవీ. ఈ దొంగగా, రాజా వంశంలో పుట్టిన గవర్నమెంట్ ఆఫీసర్ గా ద్విపాత్రాభినయం చేశారు తలైవా.

1.65 కోట్లు వసూళ్లతో పేట చిత్రం ఏడో స్థానంలో ఉంది. ఈ చిత్రం సినీ ప్రేమికులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.

1.60 కోట్లుతో ఎనిమిదవ స్థానికి చేరుకుంది పెద్దన్న సినిమా. సిస్టర్ సెంటిమెంట్ వచ్చిన ఈ చిత్రం భారీ పరాజయాన్ని చవిచూసింది.