24 September 2023
రీసెంట్ డేస్లో హీరో విశాల్.. సినిమాల్లో కంటే.. వార్తల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఎప్పుడూ ఏదో వివాదంలో మునిగితేలుతూనే ఉంటున్నారు. తన మాటలతో.. ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటున్నారు.
కోర్టు ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ 19నే తన ఆస్తి పత్రాలను.. బ్యాంక్ అకౌంట్లను కోర్టుకు సమర్పించాల్సిన విశాల్ ఆయన తరపున లాయర్...కోర్టుకు హాజరుకాకుండా మిన్నకున్నారు.
దీంతో పెద్ద మనసు చేసుకున్న కోర్టు సెప్టెంబర్ 22కు విచారణ వాయిదా వేసింది. అయితే అదే రోజు విశాల్ తరుపున విచారణకు హాజరైన జూనియర్ లాయర్ విశాల్ ఆస్తి వివరాలు కోర్టుకు సమర్పించకపోవడంతో.. సీరియస్ అయింది.
కోర్టు దిక్కారమే ఇదంటూ. ఘాటు వ్యాఖ్యలు చేసిది. విశాల్ తీరు పై సీరియస్ అయింది. అయితే కోర్టు విశాల్ పై ఆగ్రహం వ్యక్తం చేయడమే ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది.