సలార్‌కు కేజీఎఫ్ చిత్రానికి లింక్.. టీజర్ ప్రకటన పోస్టర్ లో ఇది గమనించారా..

సలార్‌కు కేజీఎఫ్ చిత్రానికి లింక్.. టీజర్ ప్రకటన పోస్టర్ లో ఇది గమనించారా..

ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు.

ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిలిమ్స్ సంస్థ  నిర్మిస్తుంది.

జులై 6న ఉదయం  5.12 గంటలకు ఈ చిత్రం టీజర్ విడుదల కానున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రం సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ మూవీకి కేజీఎఫ్ చిత్రానికి లింక్ ఉందని వార్త ఎప్పటి నుంచో వైరల్ అవుతుంది.

కాగా టీజర్  విడుదల ప్రకటనతో ఈ విషయంపై మరోసారి చర్చ మొదలైంది.

కేజీఎఫ్ 2 క్లైమాక్స్ లో షిప్ పై ఎటాక్ ఉదయం 5.12 గంటలకు జరుగుతుంది.

ఇప్పుడు టీజర్ కూడా అదే సమయానికి విడుదల చేస్తుండడంతో సలార్ కి కేజీఎఫ్ చిత్రానికి  లింక్ ఉందని వార్త మళ్ళి తెరపైకి వచ్చింది.

దీనికి సంబంధించి ఓ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.