క్యారక్టర్ నచ్చితే చిన్న పాత్రలకైనా రెడీ అంటున్న భామలు..

04 September 2024

Battula Prudvi 

పుష్పలో శ్రీవల్లి తర్వాత సీతారామమ్‌‎లో అఫ్రీన్ పాత్ర చేసిన రష్మిక.. తాను హీరోయిన్‌ కాకపోయినా... మంచి కేరక్టర్‌ చేస్తే చాలనుకుని కేరక్టర్‌ని ఒప్పుకున్నట్టు చెప్పింది.

నాని హీరోగా వచ్చిన ఎమోషనల్ సినిమా హాయ్‌ నాన్న. ఈ సినిమాలో మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌. శ్రుతి హాసన్‌ కీ రోల్‌ చేసింది.

గత ఏడాది సంక్రాంతికి ఆల్రెడీ బ్యాక్‌ టు బ్యాక్‌ రెండు హిట్లు తన కిట్టీలో వేసుకున్నారు శ్రుతిహాసన్‌. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాల్లో నటించింది శ్రుతి.

అదే ఏడాది ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ చిత్రం సలార్‌లో ఓ ముఖ్య పాత్రలో ఆకట్టుకుంది శృతి హాసన్.

మహానటి చిత్రంలో సమంత సావిత్రి బయోగ్రఫీ తెలుసుకొనే రిపోర్టర్‎ మధురవాణి పాత్రలో తనదైన నటనతో ఆకట్టుకుంది.

చిరు హీరోగా చేసిన ఆచార్య సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డే కూడా రామ్‎చరణ్‎కి జోడిగా ఫ్రెండ్లీ కేరక్టర్ చేసింది.

కేరక్టర్‌ బావుంటే నిడివిని పట్టించుకోనని ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూలో హీరోయిన్ మాళవిక మోహనన్‌ కూడా చెప్పింది.

కేరక్టర్‌కి ఇంపార్టెన్స్ ఉంటే నిత్య మీనన్‌ని కన్విన్స్ చేయడం కూడా చాలా ఈజీ. ఓ వైపు హీరోయిన్లుగా కంటిన్యూ అవుతూనే, స్పెషల్‌ రోల్స్ చేస్తున్నారు భామలు.