అందాల భామలు ఆత్మలుగా కనిపించిన చిత్రాలు..
09 October 2023
లేడీ సూపర్ అనుష్క శెట్టి పంచాక్షరీ చిత్రంలో ఆత్మ పాత్రలో నటించి ప్రేక్షకులను భయపెట్టింది. స్వీటీ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ చేసింది.
నాయకి చిత్రంలో హీరోయిన్ అవడానికి ఎదురుచూస్తున్న ఓ దయ్యం పాత్రలో తన నటనతో ఆకట్టుకుంది అందాల తార త్రిష.
శ్రీనివాస్ రెడ్డి, వెన్నల కిశోర్, తాగుబోతు రమేష్ ప్రధాన పాత్రలో నటించిన ఆనందోబ్రహ్మ చిత్రంలో దయ్యంల నటించింది తాప్సి.
తెలుగింటి తార అంజలి కూడా గీతాంజలి,చిత్రాంగద అనే రెండు చిత్రల్లో దయ్యంగా సినీ ప్రేక్షకులను భయపెట్టింది.
అందాల తార ప్రియమణి ద్విపాత్రాభినయం చేసిన చారులత చిత్రంలో ఓ పాత్రలో దయ్యంల నటించి అందరిని భయపెట్టింది.
పొట్టి పిల్ల నిత్యామీనన్ కూడా రాఘవ లారెన్స్ ముని సిరీస్ గంగ సినిమాలో గంగ అనే ఓ ఆత్మ పాత్రలో ప్రేక్షకులను మెప్పించింది.
నిఖిల్ ఎక్కడికి పోతావ్ చిన్నవాడా మూవీలో నందిత శ్వేతా దయ్యం పాత్రలో మెప్పించింది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది.
అన్న ఓంకార్ దర్శకత్వంలో అశ్విన్ బాబు హీరోగా నటించిన రాజుగారి గది 2లో సమంత ఆత్మగా కనిపించింది. ఈ చిత్రం నాగార్జున కీలక పాత్రలో ఆకట్టుకున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి