పెళ్లైన తర్వాత హీరోయిన్లకు ఒకప్పుడు ఛాన్సులు వచ్చేవి కావు.. వచ్చినా అక్క, వదిన పాత్రలతో సరిపెట్టేవాళ్లు.
కానీ ఇప్పుడలా కాదు.. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా హీరోయిన్స్‌గానే కొనసాగుతున్నారు. ఇంకా చెప్పాలంటే పెళ్లి తర్వాతే డిమాండ్ పెరిగింది వాళ్లకు.
టాలీవుడ్ టూ బాలీవుడ్ అదే ట్రెండ్ నడుస్తుంది. నయనతార, అలియా భట్, కత్రినా, దీపిక, కియారా.. ఇలా అంతా పెళ్లైన ముద్దుగుమ్మలే.
పెళ్లికి ముందు కంటే ఇప్పుడే నయన్‌కు డిమాండ్ పెరిగింది. జవాన్‌లో నటించాక సినిమాకు 18 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా 75వ సినిమాతో వస్తున్నారు నయన్.
కాజల్ అగర్వాల్ కూడా వరస ఆఫర్స్ అందుకుంటున్నారు. విడాకుల తర్వాత సమంతను ఎవరూ అడ్డుకోలేకపోతున్నారు. ఈ బ్యూటీ షోకు థర్మామీటర్లు పేలిపోతున్నాయి.
బాలీవుడ్‌లోనూ ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. అక్కడ కత్రినా కైఫ్ టైగర్ 3తో పాటు మేరీ క్రిస్మస్‌లో నటిస్తున్నారు.
ఇక అలియాకు వరస ఛాన్సులు వస్తూనే ఉన్నాయి. దీపిక ప్రాజెక్ట్ కేతో పాటు మరో మూడు నాలుగు సినిమాలు చేస్తున్నారు.
కియారా అద్వానీకి కూడా ఆఫర్స్ ఫుల్లుగా ఉన్నాయి. మొత్తానికి పెళ్లైన ముద్దుగుమ్మలకే ఇప్పుడెక్కువ డిమాండ్ ఉంది.