బాలయ్య సినిమాలో చేసి కూడా ఫేమ్ ను యుటిలైజ్ లేని హీరోయిన్స్..
18 September 2023
బాలకృష్ణ సినిమాల్లో అవకాశాలు ఒకటికి రెండు సార్లు వచ్చినా ఉపయోగించుకోలేకపోయారు సోనాల్. లెజెండ్‌లోనూ, డిక్టేటర్‌లోనూ బాలయ్య పక్కన స్టెప్పులేసిన ఈ బ్యూటీ.
అప్పుడెప్పుడో బాణం సినిమాతో పక్కింటమ్మాయిలా పద్ధతిగా మెప్పించారు వేదిక. ఆ తర్వాత తెలుగులో సరైన అవకాశాలు రాలేదు ఈ బ్యూటీకి.
అయినా రూలర్‌లో బాలయ్య పక్కన చూసిన వారు మాత్రం షి ఈజ్ బ్యాక్ అనుకున్నారు. కానీ ఆడియన్స్ ఆశించినన్ని సినిమాలను మాత్రం బ్యాక్ టు బ్యాక్ అందుకోలేకపోయారు బ్యూటీ.
సోనాల్, వేదిక విషయంలో జరిగిందే ప్రగ్యా జైస్వాల్ విషయంలోనూ రిపీట్ అయింది. బాలయ్య కెరీర్‌లో అత్యద్భుతమైన కలెక్షన్లతో దుమ్మురేపిన సినిమా అఖండ.
ఈ సినిమాలో జై బాలయ్యా అంటూ పాటేసుకున్నారు ప్రగ్యా జైస్వాల్. మంచి రోల్‌లో కనిపించినా, ఆమెను అవకాశాలు మాత్రం మెండుగా పలకరించలేదు మరి.
వీరసింహారెడ్డిలో మరదలు గుర్తుందా? మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయ్ అంటూ తెలుగు కుర్రకారు గుండెల్ని మెత్తగా గిల్లిన మలయాళ బ్యూటీ హనీరోజ్.
సంక్రాంతికి నందమూరి ఫ్యాన్స్ ని ముద్దుగా పలకరించిన ఈ బొద్దుగుమ్మ, వెంట వెంటనే తెలుగు సినిమాలనైతే జోరుగా ఒప్పుకున్న దాఖలాలు లేవు.
బాలయ్య లాంటి మాస్ హీరోతో సినిమా చేస్తే, మరిన్ని అవకాశాలు తెచ్చుకోవాలిగానీ, ఇలా సైలెంట్ ఎందుకవుతున్నారనే చర్చ మాత్రం గట్టిగా జరుగుతోంది జంక్షన్లో.