డార్లింగ్‎‎తో 3 సినిమాలు చేసిన భామలు వీరే..

TV9 Telugu

06 August 2024

ప్రభాస్, అనుష్కది బెస్ట్ పెయిర్ అంటారు. వీరిద్దరూ హీరో హీరోయిన్లుగా నాలుగు సినిమాలు చేసారు. అవేంటో చూద్దాం..

డార్లింగ్, స్వీట్ జంటగా నటించిన తొలి చిత్రం బిల్లా. దీనికి మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. కృష్ణంరాజు కీలక పాత్ర పోషించారు.

తర్వాత వీరిద్దరూ కలిసి ఆకట్టుకున్న చిత్రం మిర్చి. ఇది డైరెక్టర్ కొరటాల శివ తొలి చిత్రం. ఇది బ్లాక్ బస్టర్ అయింది.

తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన బాహుబలి 1 ది బిగినింగ్, బాహుబలి 2 ది కంక్లూజన్ సినిమాల్లో నటించారు.

అలాగే త్రిష కూడా రెబెల్ స్టార్ సరసన మొత్తం మూడు సినిమాల్లో కథానాయకిగా నటించింది. ఆ సినిమాలు ఏంటంటే..

ప్రభాస్, త్రిష కృష్ణన్ జంటగా నటించిన మొదటి చిత్రం వర్షం. గోపీచంద్ విలన్ గా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది.

తర్వాత వీరిద్దరూ జోడిగా మెప్పించిన సినిమా పౌర్ణమి. ఇందులో ఛార్మి మరో హీరోయిన్. ఈ సినిమా మ్యూజికల్ హిట్.

డార్లింగ్, త్రిష జంటగా పూరి జగన్నాథ్ తెరకెక్కిన సినిమా బుజ్జిగాడు. ఇందులో ప్రభాస్ మాస్ యాక్షన్ అదిరిపోయింది.