TV9 Telugu
నిత్యా మీనన్ లవ్ ఫెయిల్యూరా..? ఆ ఇండస్ట్రీ టాక్.
20 March 2024
ఎప్పుడూ అబ్బాయిలే లవ్‌లో ఫెయిల్ అవ్వాలా? అమ్మాయిలు కాకూడదా? రిలేషన్‌షిప్స్ పై అమ్మాయిలకు ఒపీనియన్ ఉండకూడదా.?
అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు బెంగుళూరు బ్యూటీ నిత్యామీనన్. సడన్ గా ఈ బ్యూటీకి ఇన్ని డౌట్స్ ఎందుకు అనుకుంటున్నారా?
దానికి కారణం లేకపోలేదు. సూటిగా.. సుత్తిలేకుండా మాట్లాడటం తనకు అలవాటు అంటున్నారు హీరోయిన్ నిత్యామీనన్.
కథలు నచ్చినా, నచ్చకపోయినా మొహమాటానికి పోయి సినిమాలు చేసే అలవాటు తనకు అస్సలు లేదని చాల గట్టిగానే చెప్తుంది.
తనతోపాటు ఎంతమంది హీరోయిన్లు స్క్రీన్ షేర్ చేసుకున్నా కూడా డోంట్ కేర్ అనే యాటిట్యూడ్ ఈ అమ్మడి సొంతం.
లేటెస్ట్ గా ఈ ముద్దుగుమ్మ ఓ సినిమాకు సైన్ చేశారు. అందులో లవ్ ఫెయిల్యూర్ అమ్మాయిగా కనిపిస్తారని టాక్.
రిలేషన్‌షిప్స్ ని నేటి తరం అమ్మాయిలు ఎలా చూస్తున్నారన్న విషయం మీద ఈ సినిమాలో డిస్కషన్ ఉంటుంది అంట..
మంచి కంటెంట్, సెన్సిటివ్ సబ్జెక్టు ఉన్నప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి తనకెలాంటి ఇబ్బందీ లేదంటారు నిత్యా.
ఇక్కడ క్లిక్ చెయ్యండి