రత్నం నుంచి కొత్త పాట.. ఓదెల 2 గురించి సంపత్..

TV9 Telugu

12 March 2024

హీరోయిన్ త్రిష ఇప్పుడు మరోసారి ప్రయోగం చేస్తున్నారు. ఇంతకు ముందు ఆమె చేసిన ఎక్స్ పెరిమెంట్‌ సక్సెస్‌ కాలేదు.

ఒకసారి కాకపోతే ఏంటి? మళ్లీ మళ్లీ ట్రై చేయాలి కదా... అందుకే చేస్తున్నా! అనే ధోరణి కనిపిస్తోంది త్రిషలో.

ఇంతకీ ఆ ప్రయోగం ఏంటని అంటారా? మారేది కదండీ ఆమె హీరోయిన్ గా నటిస్తున్న ఓ సినిమాల్ డబుల్‌ రోల్‌ చేయడం.

ఆల్రెడీ తెలుగు-తమిళ ద్విభాషా కామెడీ హారర్ చిత్రం నాయకి సినిమాలో డబుల్‌ యాక్షన్‌ చేశారు హీరోయిన్ త్రిష.

ఇప్పుడు చిరుకి జోడిగా నటిస్తున్న విశ్వంభరలో కూడా ఆమె డ్యూయల్‌ రోల్‌ చేస్తున్నారన్నది ట్రెండింగ్‌ న్యూస్‌.

విశ్వంభర మూవీ సెట్లో ఆమె అడుగుపెట్టినప్పటి నుంచీ ఏదో ఒక రకంగా ట్రెండింగ్‌లోనే ఉంటున్నారు త్రిష కృష్ణన్.

లేటెస్ట్ గా చిరు ఇచ్చిన గిఫ్ట్ గురించి కూడా సోషల్‌ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టారు చెన్నై సుందరి త్రిష.

ఆ పోస్టు వైరల్‌ అయ్యేలోపే, విశ్వంభరా మూవీలో డబుల్‌ యాక్షన్‌ అంటూ త్రిష గురించి ఈ న్యూస్‌ వైరల్‌ అవుతోంది.