TV9 Telugu

31 January 2024

ఆ సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసిన తాప్సీ.

గత ఏడాది వచ్చిన సినిమాల్లో సంచలన హిట్ కొట్టి ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమా యానిమల్.

యానిమల్ సినిమా పై కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ.. యానిమల్ రికార్డ్ క్రియేట్ చేసింది.

యానిమల్ సినిమా పై ఇప్పటికే చాలా మంది రకరకాలుగా రియాక్ట్ అయ్యారు. తాజాగా తాప్సీ కూడా స్పందించారు.

ఇప్పటికే తాప్సీపన్ను చాలా వివాదస్పద కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. యానిమల్ సినిమా పై షాకింగ్ కామెంట్స్ చేసింది తాప్సీ.

సినిమా యాక్టర్స్ కు ఓ పవర్ ఉంటుంది. అలాగే సమాజం పై బాధ్యత కూడా ఉండాలి.

మిగిలిన వారందరూ దీని పాటించాలని నేను చెప్పడం లేదు. మనది ప్రజాస్వామ్య దేశం మనకు నచ్చింది చెయ్యొచ్చు..

అయితే నేను మాత్రం యానిమల్ లాంటి సినిమాలో నటించే దాన్ని కాదు అని చెప్పుకొచ్చింది తాప్సీపన్ను.