26 August 2024
నాతో అలా ప్రవర్తించడం తప్పు.. ఎవరైనా సరే నో.. తాప్సీ కామెంట్స్..
Rajitha Chanti
Pic credit - Instagram
మంచు మనోజ్ హీరోగా డైరెక్టర్ రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది తాప్సీ.
మంచు లక్ష్మి నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీ 2010లో విడుదలైంది. మొదటి సినిమాతోనే మ్యూజికల్ హిట్ అందుకుంది హీరోయిన్ తాప్సీ.
ఆ తర్వాత తక్కువ సమయంలోనే తెలుగులో స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసింది. అందం, అభినయంతో మెప్పించి స్టార్ డమ్ అందుకుంది ఈ బ్యూటీ.
కొన్నాళ్లుగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ అక్కడే సెటిల్ అయ్యింది.
హిందీ సినిమాలతో దూసుకెళ్తున్న తాప్సీ తాజాగా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. తాను నటిని మాత్రమే అని పబ్లిక్ ప్రాపర్టీ కాదన్నారు తాప్సీ.
ఇటీవల తాప్సీని కెమెరాల్లో బంధించేందుకు కొందరు ఫోటోగ్రాఫర్స్ పోటీపడ్డారు. అందుకు ఈ హీరోయిన్ నో అంటే నో అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
తాను కేవలం నటిని మాత్రమే అని.. పబ్లిక్ ప్రాపర్టీని కాదన్నారు. రెండింటికీ చాలా తేడ ఉంటుందని.. కెమెరాలతో తనపైకి దూసుకురావడం తప్పు అన్నారు.
ఫోటోస్ కోసం దూసుకురావడం, ఫిజికల్ హ్యాండిల్ చేయడం చాలా తప్పని.. ఎవరైనా నో అంటే వారి అభిప్రాయానికి గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలని అన్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి.