అవకాశాలు లేక డీలా పడిపోయిన శ్రీనిధి శెట్టి.. మళ్లీ సినిమాలు చేస్తుందా?

Anil Kumar

11 July 2024

మోడలింగ్ రంగం నుండి నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ శ్రీనిధి శెట్టి.

తన మొదటి సినిమా కేజీఎఫ్.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సాలిడ్ హిట్ అందుకొని ఒక్కసారిగా ఫెమస్ అయ్యింది.

కేజీఎఫ్ సినిమా రెండు భాగాల్లోనూ నటించి ఒక్కసారిగా పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.

కేజీఎఫ్ తర్వాత చియాన్ విక్రమ్ తో కోబ్రా మూవీలో మెరిసింది. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది.

శ్రీనిధి చేసిన మూడు సినిమాల్లో రెండు హిట్స్.. ఒక ప్లాప్.. కావడంతో ఈ బ్యూటీకి పెద్దగా అవకాశాలు రాలేదు.

సినిమా కెరీర్ అంతగా సక్సెస్ కాలేకపోయినా వరుసగా ఫోటోషూట్స్ చేస్తూ అదరగొట్టేస్తుంది వయ్యారి శ్రీనిధి శెట్టి.

క్రేజ్ సంపాదించాలంటే సినిమాలే చేయాల్సిన అవసరం లేదుని.. ఈ ముద్దుగుమ్మ ఫోటోషూట్స్ చూస్తే తెలిసిపోతుంది.

ఇలా సోషల్ మీడియాలోనూ ఫేమస్ కావొచ్చని చెప్పకనే చెప్పేస్తుంది. ఇక ఇప్పుడిప్పుడే సినిమాలకు సైన్ చేస్తుంది.