TV9 Telugu
ఆ నమ్మకంతో వేశ్య పాత్ర చేశాను: శోభితా ధూళిపాళ.
09 April 2024
తెలుగు, హిందీలో అనేక సినిమాల్లో నటించిన గ్లామర్ హీరోయిన్ శోభితా ధూళిపాళ ఇప్పుడు హాలీవుడ్ లో అడుగుపెట్టింది.
ఇటీవలే శోభిత ధూళిపాళ నటించిన హాలీవుడ్ సినిమా మంకీ మ్యాన్. ఈ చిత్రానికి దేవ్ పాటిల్ దర్శకత్వం వహించారు.
ఇందులో సికందర్ ఖేర్ కీలకపాత్రలో నటించారు. ఏప్రిల్ 5న అమెరికాలో రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ రివ్యూ వచ్చింది.
మన దగ్గర కూడా ఈ నెల 26న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు.
మంకీ మ్యాన్ సినిమాలో సీత అనే వేశ్య క్యారెక్టర్ చేసినట్టు చెప్తూ., కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు శోభిత.
ఇందులో వేశ్య పాత్రలో నటించినందుకు చాలా గౌరవంగా ఉంది, నా పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉందని చెప్పుకొచ్చింది.
అందుకే నమ్మకంతో ముడిపడిన ఇలాంటి పాత్రలో నటించినందుకు గౌరవంగా అనిపించిందని అన్నారు హీరోయిన్ శోభితా ధూళిపాళ.
అడివి శేష్ గూఢచారి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. అలాగే మేజర్ సినిమాలోనూ కీలకపాత్రలో నటించి మెప్పించారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి