అది తెలిసి ఆశ్చర్యపోయానన్న శ్రుతిహాసన్‌.. సరిపోదా శనివారం రెండో షెడ్యూల్‌..

30 December 2023

TV9 Telugu

శ్రుతిహాసన్‌కి సలార్‌ సినిమాలో డ్యాన్సులు లేవా అని రాజమౌళి అడిగినట్టు తెలిసి ఆశ్చర్యపోయాను అన్నారు ఆమె.

నా డ్యాన్సులంటే ఆయనకు ఇష్టమని తెలిసినప్పుడు సంతోషంగా అనిపించిందని అన్నారు స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్‌.

ఆమె నటించిన సలార్‌ ఇటీవల విడుదలైంది. బ్లాక్ బస్టర్ టాక్ తో ఇప్పటికే 500పైగా వసూళ్లు రాబట్టింది ఈ సినిమా.

నాని హీరోగా వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సరిపోదా శనివారం. ప్రియాంక మోహన్ కథానాయక.

అంటే సుందరానికి తర్వాత వివేక్‌ ఆత్రేయతో నాని హీరోగా రెండో చిత్రమిది. ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది.

నవంబర్‌లో ఓ షెడ్యూల్‌ పూర్తయిందని, రెండో షెడ్యూల్‌ని హైదరాబాద్‌లో మొదలుపెట్టామని అన్నారు మూవీ మేకర్స్.

శివ కంఠమనేని హీరోగా నటిస్తున్న సినిమా రాఘవరెడ్డి. ఈ సినిమాను జనవరి 5న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.

ముఖ్య అతిథిగా పాల్గొన్న తుమ్మల ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ చిన్న సినిమాల వల్లే చిత్ర పరిశ్రమ బతుకుందని అన్నారు.