'మీరు కమిటెడా' అని అడిగిన అభిమాని .. దిమ్మ తిరిగే ఆన్సర్ ఇచ్చిన శృతి హాసన్

Phani.ch

25 May 2024

శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..  లోక నాయకుడు కమల్ హాసన్ నట వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.

2011లో కె. రాఘవేంద్రరావు కొడుకైన కె.ప్రకాష్ దర్శకత్వంలో సిద్దార్థ్ సరసన అనగనగా ఓ ధీరుడు సినిమాతో తెలుగుతెరకు ఎంట్రీ ఇచ్చింది.

అయితే శృతి హాసన్ కెరీర్ బిగినింగ్ నుండి పలు ఎఫైర్ రూమర్స్ ఎదుర్కొంది. అధికారికంగా ఆమె మైఖేల్ కోర్స్లే తో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది.

కెరీర్ పీక్స్ లో ఉన్న సమయం లో  మైఖేల్ కోసం శృతి హాసన్ కెరీర్ కూడా వదిలేసింది. సినిమాలు చేయడకుండా లండన్ లో మకాం వేసింది. 

అయితే అనూహ్యంగా వీరు 2019లో బ్రేకప్ చెప్పుకున్నారు. శృతి కొంత డిప్రెషన్ అనుభవించినట్లు సమాచారం. ఇండియాకు వచ్చి కెరీర్ పై ఫోకస్ పెట్టింది.  

మరలా ముంబైకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారిక తో ప్రేమలో పడింది. రెండేళ్లకు పైగా వీరు ప్రేమించుకుంటున్నారు. అయితే శాంతను ని సైతం ఆమె వదిలేసినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఆన్లైన్ లో అభిమానులతో చాట్ చేసిన శృతి హాసన్ ని ఓ వ్యక్తి 'మీరు సింగిలా లేక కమిటెడ్ నా ??' అని అడిగాడు.

ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నేను ఇష్టపడను. కానీ చెబుతాను. నేను ప్రస్తుతం సింగిల్. మింగిల్ కావడానికి ఎప్పుడూ సిద్ధం అని సమాధానం చెప్పింది.