TV9 Telugu

12 January 2024

పెళ్లికి రెడీ చేశారు.! కానీ అంటూ షాక్ ఇచ్చిన శ్రద్దా.

గత కొంతకాలంగా బాలీవుడ్‌లో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఈ లిస్టులో శ్రద్ధా కపూర్ పేరు కనబడడం లేదు.

ఇక తాజాగా శ్రద్దా కపూర్ పెళ్ళికి రెడీ అవుతున్నారని అంటున్నారు బాలీవుడ్ మీడియా వారు.

కానీ తనేమో.. అబ్బే అదేం లేదన్నట్టు.. మరో కూత కూస్తున్నారు.

ఇక ప్రస్తుతం సినిమా ఛాన్సులు లేక వెబ్‌ సిరీస్‌లు, బుల్లితెర షోలు.. చేసుకుంటూ తన ఫ్యాన్స్‌ ను ఎంటర్‌ టైన్ చేస్తున్న శ్రద్దా కపూర్.. 

తాజాగా పెళ్లికి రెడీ అయ్యారట. ఓ బిజినెస్‌ మ్యాన్‌తో త్వరలో మూడు ముళ్లు వేయించుకునేందుకు ముహూర్తాల కోసం చూస్తున్నారట. 

ఇప్పటికే అతనితో డేటింగ్‌ అండ్ లవ్వింగ్ కూడా చేస్తున్నారట ఈ బ్యూటీ.

అయితే బాలీవుడ్ మీడియా కోట్ చేస్తున్న ఈ న్యూసుల పై తాజాగా శ్రద్దా కూడా రియాక్టయింది.

తనే బిజినెస్ మేన్‌తో డేటింగ్‌ చేయడంలేదని.. ఆ న్యూస్‌ను ఎవరూ నమ్మొద్దంటూ చెప్పుకొచ్చింది.