TV9 Telugu
22 February 2024
తన భర్తతో విడిపోయిన ఏడాది ఎంతో కష్టతరమైంది అంటూ సామ్ ఎమోషనల్.!
కొన్ని నెలలుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు హీరోయిన్ సమంత. మయోసైటిస్ సమస్య వల్ల విశ్రాంతి తీసుకుంటుంది.
ఇప్పుడిప్పుడే తిరిగి ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించారు.
అయితే ఇప్పుడు సొంతంగా పాడ్ కాస్ట్ ఛానల్ ప్రారంభించారు. తన గురించి అభిమానులతో పంచుకోవడం మొదలుపెట్టారు.
సామ్ హెల్త్ పాడ్ కాస్ట్ సిరీస్ TAKE20 ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయ్యింది. ఇందులో ఆమె అనారోగ్య సమస్యలు, చికిత్స, జాగ్రత్తలు గురించి పంచుకున్నారు.
అలాగే మరోసారి డివోర్స్ గురించి రియాక్ట్ అయ్యారు. తన జీవిత భాగస్వామితో విడిపోయిన ఏడాది ఎంతో కష్టతరమైనదని..
అత్యంత కష్టమైన ఏడాది అంటే అదేనంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ పాడ్ కాస్ట్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
అలాగే సామ్ మాట్లాడుతూ.. “నేను ఈ పాడ్ కాస్ట్ చేయడానికి కారణం.. నేను అనుభవించిన బాధాకరమైన పరిస్థితులు..
నేను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాను అనే విషయాలను ప్రజలకు.. నా అభిమానులతో పంచుకోవాలని అనుకుంటున్నాను. అని తెలిపింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి