తనను జైల్లో పెట్టాలన్న డాక్టర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సమంత.
Anil Kumar
07 July 2024
కొద్దీ రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమంత - డాక్టర్ ఇష్యూ తాజాగా మరోసారి హాట్ టాపిక్ అవుతోంది.
హైడ్రోజన్ పెరాక్సైడ్‌తో చేసే నెబ్యులైజేషన్ పై తన పాడ్‌క్యాస్ట్‌లో మాట్లాడటంపై చిన్నపాటి డిబెట్‌ను షురూ అయ్యింది.
సమంత చెప్పిన హైడ్రోజన్ తో నెబ్యులైజేషన్ ప్రక్రియ చాలా డేంజర్ అని, దాని వల్ల ప్రాణాలు పోయే అవకాశం ఉందని..
డాక్టర్ అభయ్ ఫిలిప్ సమంతపై నేరుగా విమర్శలు చేశారు. అవి కూడా అతిగా చెప్పినట్టు ఉందని.. వాటిని వ్యతిరేకిస్తూ.,
అభ్యంతరకరంగా ఉన్నాయంటూ డా.అభయ్ ఫిలిప్ కామెంట్స్ చేసారు. తాజాగా ఈయన కామెంట్స్ పై రియాక్టయ్యారు సమంత.
ఒక పెద్దమనిషి తన పోస్ట్‌ను, సలహాలను ఉద్దేశపూర్వకంగా బలమైన పదాలతో దూషించారని ఆ డాక్టర్ పై ఓ పోస్ట్ పెట్టారు.
ఆయన కూడా డాక్టరే. తన కంటే ఎన్నో విషయాలపై అవగాహన ఉంటుందనడంలో సందేహం లేదు. కానీ..తనను నిందించడం కంటే..
తనకు చికిత్స చేసిన డాక్టర్‌తో ముఖాముఖిలో పాల్గొని ఉంటే బాగుండేదని చాలా కూల్‌గా ఈ డాక్టర్‌కు కౌంటర్ ఇచ్చేశారు సామ్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి