రాజ్‌ తో సమంత డేటింగ్‌.? అసలు ఎవరీ రాజ్‌.?

Anil Kumar

16 August 2024

స్టార్ హీరోయిన్ సమంతతో డైరెక్టర్ రాజ్ డేటింగ్‌లో ఉన్నాడని గత రెండు రోజులుగా నెట్టింట వార్తలు వస్తున్నాయి.

ఈ వార్తలను నిజం చేస్తూ.. వీరిద్దరి సోషల్ మీడియా హ్యాండిల్లో కలిసి ఉన్న కొన్ని ఫోటోలు బయటకి వస్తున్నాయి.

ఆ ఫొటోస్, వీడియోస్ కాస్త ట్రోల్ల్స్ , కామెంట్స్ తో నెట్టింట విపరీతంగా చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.! 

ఇక ఈక్రమంలోనే సమంత ఫ్యాన్స్‌ అండ్ నెటిజన్స్ చాలామంది ఎవరీ రాజ్ అంటూ ఆరాతీయడం, సెర్చ్ చెయ్యడం మొదలుపెట్టారు.

నెట్టింట ఈ డైరెక్టర్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రాజ్ ఎవరో కాదు.. మన తెలుగు వాడే.

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో సిటీలో జన్మించారు. ఇంజనీరింగ్ తర్వాత హైయర్ స్టడీస్‌ కోసం అమెరికాకు వెళ్లి..

తన స్నేహితుడు కృష్ణ డీకేతో కలిసి డీ2ఆర్ ఫిల్మ్ బ్యానర్‌ను స్థాపించడం తో రాజ్ కెరియర్ మొదలైంది అని టాక్.

షార్ట్‌ ఫిల్మ్ నుండి మొదలైన కెరియర్ ఇప్పుడు బాలీవుడ్‌లో సినిమాలు తీస్తూ.. బెస్ట్ డైరెక్టర్స్‌గా మారిపోయారు.