సమంత 'మా ఇంటి బంగారం'.. గుడ్ న్యూస్ చెప్పిన సామ్.

29 April 2024

ANIL KUMAR 

సమంత ఈజ్ బ్యాక్.. కొంతకాలంగా ఆరోగ్య సమస్యల వల్ల సినిమాలకు బ్రేక్ తీసుకున్న సామ్.. రీఎంట్రీకి సిద్ధమైంది.

విదేశాల్లో ట్రీట్మెంట్ తీసుకొని తన హెల్త్ ప్రాబ్లెమ్స్ నుండి బయటపడుతున్న ఈ అమ్మడు మళ్లీ బౌన్స్ అవుతుంది.

సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ.. ఫోటోషూట్స్ , పాడ్ కాస్ట్ అంటూ అభిమానులకు దగ్గరగానే ఉంది.

సామ్ హీరోయిన్ గానే కాక కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ ప్రొడ్యూసర్ గా కూడా అడుగులు వేసిన సంగతి తెలిసిందే.!

త్రాలాల మూవీంగ్ పిక్చర్స్ పేరుతో సొంతం బ్యానర్ ను స్థాపించి.. టాలెంట్ ఉండి అవకాశాల లేని వారికి చేయూత ఇస్తున్నారు.

తాజాగా ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు సోషల్ మీడియాలో అభిమానుల నుండి సినీ తరాల నుండి విషెస్ వెల్లువెత్తాయి.

ఇదే క్రమంలో సామ్ ప్రొడ్యూసర్ గా తన బ్యానర్ లో వస్తున్న ఫస్ట్ మూవీని అనౌన్స్ చేస్తూ టైటిల్ రివీల్ చేసారు.

ఇందులో హీరోయిన్ కూడా సమంతనే.. ఈ సినిమా టైటిల్ 'మా ఇంటి బంగారం'. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.