ఈ వయ్యారి అందం పోటీపడి.. ఈమె చెంత బందీగా మారింది..

TV9 Telugu

10 July 2024

‘జయం’ సినిమాలో నితిన్ సరసన నటించి మెప్పించింది అందాల భామ సదా.. తొలి సినిమాతోనే భారీ విజయం అందుకుంది.

వెళ్లవయ్యా.. వెళ్లు.. వెళ్లూ అంటూ లంగా ఓణిలో మెరుస్తూ ఈ అమ్మడు చెప్పిన డైలాగ్ కుర్రాళ్లకు బాగా కనెక్ట్ అయ్యింది.

తమిళ్ లో విక్రమ్ సరసన ‘అపరిచితుడు’ సినిమాలో నటించింది. ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్‌గా నిలిచింది.

ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఈ సీనియర్ హీరోయిన్ రీసెంట్ గా పలు టీవీ షోల్లో కనిపిస్తూ ఆకట్టుకుంటుంది సదా

సోషల్ మీడియాలో మాత్రం ఈ సీనియర్ హీరోయిన్ చాలా యాక్టివ్ గా గడిపేస్తుంది. కొత్త కొత్త ఫొటోలతో కవ్విస్తుంది.

వయసు పెరుతుతున్నా తరగని అందంతో ఆకట్టుకుంటుంది సదా. ఈ క్రమంలో ఆమె సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను వదిలింది

ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. వైట్ కలర్ డ్రస్ లో అదరగొట్టింది ఈ సీనియర్ బ్యూటీ..

ఈ అమ్మడి ఫోటోలకు కుర్రకారు కొంటె కామెంట్స్ చేస్తున్నారు. సదా నన్ను పెళ్లి చేసుకోవా.. అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.