అవకాశాలు తగ్గినా.. నో గ్లామర్ షో.! ట్రెండీగా కవ్విస్తున్న రీతూ వర్మ

Anil Kumar

15 October 2024

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి.. ఇప్పుడు హీరోయిన్ గా మారి సినిమాలు చేస్తోన్న భామల్లో రీతూ వర్మ ఒకరు.

కేవలం తెలుగులోనే కాదు.. తమిళ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ అందాల ముద్దుగుమ్మ.

ఎన్టీఆర్ బాద్ షా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి.. పెళ్లి చూపులు సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది రీతూ.

ఆ తరువాత ప్రేమ ఇష్క్ కాదల్, నా రాకుమారుడు, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాల్లో హీరోయిన్ గా చేసి ఆకట్టుకుంది.

ఆతర్వాత వరుసగా నిన్నిలా నిన్నిలా, టక్‌ జగదీష్‌, ఒకే ఒక జీవితం, కణం, ఆకాశం, మార్క్ ఆంటోని సినిమాలు చేసింది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ.. శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న స్వాగ్  సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ స్వాగ్ సినిమా తర్వాత రీతూ స్టార్ హీరోయిన్ అవ్వడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు మరియు ఆమె ఫ్యాన్స్.

అవకాశాలు ఎన్నోచిన ఆమె మాత్రం గ్లామర్ షో కి దూరంగా ఉంటూనే వస్తుంది. తాజా ఫొటోస్ లో కూడా ట్రెండీగా కనిపించింది.