వయ్యారాలు వడ్డిస్తూ బీచ్ లో ఫోటోషూట్.. రెబా మోనికా జాన్ వండర్స్.

Anil Kumar

19 June 2024

శ్రీ విష్ణు హీరోగా సామజవరగమన సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైంది హీరోయిన్ రెబా మోనికా జాన్.

మొదటి సినిమా అవకాశం సద్వినియోగం చేసుకొని తన అందం, అభినయంతో ప్రేక్షకులతో పాటు కుర్రకారుని మెప్పించింది.

ఆ తరువాత అవకాశాలకోసం చూస్తున్న ఈ క్రేజీ బ్యూటీ తాజాగా ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో ఛాన్స్ అందుకుంది.

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ కొత్త సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటించనుంది అని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

మ్యాడ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ తో శర్వానంద్ తన కొత్త సినిమా చేయనున్నాడట.

ఆ సినిమాలో రెబా మోనికా ని హీరోయిన్ గా ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు.

ఇదిలా ఉంటె ఈ అమ్మడు సోషల్ మీడియాలో రెచ్చిపోతుంది. ఎలాగైనా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.

తాజాగా ఈ వయ్యారి బీచ్ లో వైట్ షార్ట్ లో  షేర్ చేసిన ఫొటోస్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతూ ఆకట్టుకుంటున్నాయి.