TV9 Telugu
28 January 2024
ఆ హీరోయిన్ బయోపిక్‌లో నటించాలని ఉందన్న రష్మిక.
కన్నడ ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్ లోకి అడుగు పెట్టి ఇక్కడ స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది రష్మిక మందన్న.
కన్నడ లో కిరాక్ పార్టీ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైనా రష్మిక. తెలుగులో చలో సినిమాతో పరిచయం అయ్యింది.
ఆతర్వాత వరుసగా టాలీవుడ్ లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించింది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ.. ఓ స్టార్ హీరోయిన్ బయోపిక్ లో నటించాలని ఉంది అని తెలిపింది.
ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు ఒకప్పుడు తన అందంతో అభినయంతో కట్టిపడేసిన సౌందర్య.
సౌందర్య అనే తనకు చాలా ఇష్టమని.. ఆమె జర్నీ చాలా ఇష్టం అని తెలిపింది రష్మిక.
అవకాశం వస్తే ఆమె బయోపిక్ లో నటిస్తానని తెలిపింది రష్మిక.
సౌందర్య బయోపిక్ లో నటిస్తా అని రష్మిక చెప్పడంతో ఆమె అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి