రష్మిక గ్రీన్ సిగ్నల్.. నేషనల్ క్రష్ చేతిలో మరో సినిమా.

Anil Kumar

05 May 2024

పుష్ప సక్సెస్ తో నేషనల్ క్రష్ రష్మిక మందన్న జోరు వేరే రేంజ్ లో పెరిగిపోయింది.. ఇప్పట్లో తగ్గేలా లేదు.

వరుస ఆఫర్స్ తో చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్న రష్మిక మందన్న ఇప్పుడు మరో సినిమాకు ఓకే చెప్పారు.

కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ హీరోగా శిబి చక్రవర్తి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుబోతుంది అని తెలిసిందే.

ఈ సినిమాలో నటించేందుకు రష్మిక ను సంప్రదించగా.. ఈ ముద్దుగుమ్మ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం పుష్ప 2తో పాటు మరో మూడు సినిమాలు., యాడ్స్ తో బిజీగా గా ఉన్న ఈ బ్యూటీ ఖాతాలో మరొక సినిమా చేరింది.

అయితే ఇప్పటికే బిజీగా ఉన్న రష్మిక శివ కార్తికేయన్ సినిమా కోసం డేట్స్ అడ్జస్ట్ చేస్తునట్టు తెలుస్తుంది.

కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ చిన్నది పుష్ప తరువాత ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది.

రష్మిక తెలుగు, తమిళం, పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ చిన్నది. బాలీవుడ్‌లో పెద్ద స్టార్ నటులతో నటిస్తుంది.