'స్టార్‌ కావాలంటే తప్పదు' క్యాస్టింగ్‌ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.

Anil Kumar

09 May 2024

ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఎప్పుడూ హాట్ టాపికే.. తాజాగా రమ్యకృష్ణ కాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసారు.

సినిమాల్లో శివగామి.. నటనతో ఆకట్టుకునే డైనమిక్ లేడీ.. ఈమెని బేస్ చేసుకొని ఎలాంటి స్టోరీ అయినా రాసేయొచ్చు.

రమ్యకృష్ణ నటనకు ఫిదా అవ్వని వారు ఉండరు అని చాల కాన్ఫిడెంట్ గా చెప్పేయొచ్చు.. నటనలో తనకంటూ మార్క్ ఉంది.

కానీ నిజజీవితంలో రమ్యకృష్ణ చాల మృధుస్వభావం కలిగి ఉంటుందని.. ఏదైనా తన స్టైల్ లోనే ఉంటుందని ఇండస్ట్రీలో టాక్..

రియల్ లైఫ్ లో చాలా ప్రాక్టికల్‌గా మాట్లాడుతూ.. అప్పుడప్పుడూ అందర్నీ షాక్ అయ్యేలా చేస్తుంటారు రమ్యకృష్ణ.

ఇప్పుడు కూడా క్యాస్టింగ్ కౌచ్‌పై అలాగే మాట్లాడి.. అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. క్యాస్టింగ్ కౌచ్ ప్రతీ చోట ఉంటుందని..

అయితే సినీ పరిశ్రమ గ్లామర్‌ ఇండస్ట్రీ కావడంతో ఫిల్మ్ ఇండస్ట్రీ జరిగేవి ఎక్కువ హైలెట్ అవుతుందని.. అన్నారు.

అంతేకాదు స్టార్ గా ఎదగాలంటే.. కొన్నిసార్లు సర్ధుకుని ముందుకెళ్లాలని అనడం అందరికి షాక్ అయ్యేలా చేసింది.