TV9 Telugu

నా సినిమా ప్లాప్ అవ్వడానికి అదే కారణం అంటున్న రాశీఖన్నా.

04 April 2024

తెలుగు లో ఊహలు గుసగుసలాడే మూవీతో వెండితెరకు పరిచయం అయ్యిన రాశీఖన్నా తక్కువ టైంలోనే ఎక్కువ ఆఫర్స్ అందుకుంది.

ఇటు సౌత్‌ లో పలు సినిమాలు చేసి, బాలీవుడ్‌లో అడుగు పెట్టిన ఈ అమ్మడు నార్త్ లో చాలా బిజీగా మారిపోయింది.

రాశీఖన్నా కు సోషల్ మీడియాలోను తన గ్లామర్ డోస్ అండ్ న్యూ ఫోజులతో ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే సంపాదించుకుంది.

ఈ ముద్దుగుమ్మ తాజాగా షేర్ చేసిన ఫోటోలు నెట్టింట బాగా ఆకట్టుకుంటున్నాయి. గ్లామర్ షో తో పలు కామెంట్స్ కూడా వస్తున్నాయి.

ఇక తాజాగా హీరోయిన్ రాశీ ఖన్నా - సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా నటించిన 'యోధ' సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ నిలిచింది.

ఈ యోధ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కేవలం 30 కోట్లు మాత్రమే రాబట్టింది. దీనిపై రాశీ ఖన్నా నోరు విప్పారు..

ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ‘యోధ’ సినిమా పరాజయానికి ఓటీటీయే కారణమని ఈ మూవీ హీరోయిన్ రాశీఖన్నా అన్నారు.

ఈ సినిమా ఓటీటీలో విడుదల కోసం అందరూ ఎదురుచూస్తున్నారని రాశీఖన్నా అన్నారు. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.