నమ్మలేకపోతున్నా.. తెలుగు ప్రేక్షకుల ప్రేమకు రాశి ఖన్నా ఫిదా.!

Anil Kumar

26 June 2024

వరుస సినిమాలతో బిజీగా గడిపేస్తూ హిట్లు, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా దూసుకుపోతుంది అందాల ముద్దుగుమ్మ రాశి ఖన్నా.

పెద్ద పెద్ద సినిమాలకోసంమే ఎదురుచూడకుండా.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ బిజీగా గడిపేస్తుంది.

అయితే తాజాగా రాశీ ఖన్నా సోషల్ మీడియా వేదికగా టాలీవుడ్‌లో అడుగుపెట్టి పదేళ్లు పూర్తి చేసుకున్నట్టు తెలిపారు.

టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చి అప్పుడే  పదేళ్లు పూర్తయ్యాయంటే నమ్మలేకపోతున్నానని.. ఈ జర్నీ బాగుందని చెప్పారు.

ఇక్కడ భాష, సంస్కృతి తెలియకపోయినా హైదరాబాద్‌లో ధైర్యంగా అడుగుపెట్టినట్టు చెప్పారు హీరోయిన్ రాశీ ఖన్నా.

తెలుగు అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా నన్ను ఆదరించిన తీరుకు ఫిదా అయ్యానని ఆనందం వ్యక్తం చేసారు రాశీ.

టాలీవడ్ యంగ్ హీరో నాగశౌర్య హీరోగా ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ రాశీ.

తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ సొంతం చేసుకొని.. టాలీవుడ్ అగ్ర హీరోతో నటించే అవకాశాలు సొంతం చేసుకుంది.