TV9 Telugu

పాప స్మార్ట్.! దాని గురించి మాత్రం అడగకండి అంటూ ఎస్కేప్ అయినా రాశి.

10 April 2024

ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ అందుకున్న హీరోయిన్ రాశి ఖన్నా సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోతుంది.

ఈ చిన్నదిఎన్టీఆర్ లాంటి బడా హీరో సినిమాల్లో నటించినప్పటికీ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచుకోలేకపోయింది.

ప్రస్తుతం రాశి ఖన్నా చేతిలో అంతగా సినిమాలు లేవు.. రాశీ మెల్లగా వచ్చిన అవకాశాలు వదులుకోకుండా సినిమాలు చేస్తుంది.

ఇక సోషల్ మీడియాలో మాత్రం తన అందాలతో , గ్లామర్ యాంగిల్ తో అభిమానులకు కిర్రెక్కిస్తు ఫోటో షూట్స్ తో బిజీగా గడిపేస్తుంది.

ఇక ఇప్పుడు తమిళ్ సినిమా అరణ్మణై 4 అనే సినిమాలో నటిస్తుంది రాశి ఖన్నా ఈ సినిమాలో తమన్నా కూడా నటిస్తుంది.

ఈ ఇద్దరూ పోటీపడి అందాలతో అదరగొట్టనున్నారు. తాజాగా రాశి మాట్లాడుతూ.. తనకు నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమా చేయాలని ఉందని..

బాహుబలి లాంటి సినిమలో నటించాలని ఉంది అని తెలిపింది. అరణ్మణై 4 సినిమాలో తన పాత్ర మెప్పిస్తుందని తెలిపింది.

అయితే పెళ్లి ప్రస్తావన రాగానే నైస్ గా తప్పించుకుంది. పెళ్లి గురించి మాత్రం ఆ ఒక్కటీ అడక్కు అని అంటుంది రాశి ఖన్నా.