TV9 Telugu

ఆయన కోసం ఏమైనా చేస్తా.! ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.

12 April 2024

అటు షోలు., ఇటు వెబ్ సిరీసులు., మరో పక్క వరస అవకాశాలతో ప్రస్తుతం కెరీర్ పీక్స్లో ఉన్నరు హీరోయిన్ ప్రియమణి.

ఒక్క టాలీవుడ్ లోనే బిజీ అనుకుంటే పొరపాటే.. అటు బాలీవుడ్ సైతం వరస అవకాశాలు అందుకుంఉంటున్నారు ప్రియమణి.

తాజాగా ఈ ముద్దుగుమ్మ అజయ్‌ దేవ్‌గణ్ నటించిన మైదాన్‌ సినిమాలో కీలక పాత్రలో కనిపించి మెప్పించారు ప్రియమణి.

రీసెంట్ గా మైదాన్ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో పలు ప్రశ్నలు ఎదుర్కొన్నారు హీరోయిన్ ప్రియమణి. అందులో భాగంగా..

షారుఖ్‌ఖాన్‌తో కలిసి నటించే అవకాశం వస్తే మరోసారి నటించడానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నరు నటి ప్రియమణి.

షారుఖ్‌ ఒక వేళ ఫోన్ చేసి సినిమా చేద్దామంటే.. ఏదైనా వదులుకుని ఆయన దగ్గరికి వెళతా అంటూ.. ఆన్సర్ ఇచ్చారు.

ఇక ఇదే ఈవెంట్ లో మైదాన్‌ సినిమా గురించి కూడా మాట్లాడారు ప్రియ.. ఇందులో తన పాత్ర ఆకట్టుకుంటుందని అన్నారు.

బాలీవుడ్‌ నుంచి తన నటనకు గుర్తింపు ఇచ్చి అవకాశం ఉన్న పాత్రలు రావడం ఆనందంగా ఉందని చెప్పారు ప్రియమణి..