అప్పట్లో ట్రేండింగ్ హీరోయిన్.. సినిమాలకు దూరమైనా ఇప్పటికి అదే క్రేజ్..

Anil Kumar

10 June 2024

అప్పట్లో ట్రేండింగ్ అదరగొట్టిన హీరోయిన్స్.. ఇప్పుడు అనుకోని కారణాల వల్ల చాలా మంది కనిపించకుండా పోయారు.

ఆ లిస్ట్ లో ప్రముఖ నటుడు విజయ్ కుమార్ కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నటి ప్రీతా విజయకుమార్ కూడా ఒకరు..

నటుడు విజయ్ కుమార్ - నటి మంజులకు ముగ్గురు కుమార్తెలు.. వారిలో ఒకరు మన ఈ హీరోయినే ఈ ప్రీతా విజయకుమార్.

ఈ అమ్మడు 'రుక్మిణి' అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.. తొలి సినిమాతోనే మంచి ప్రశంసలు అందుకుంది.

ఆ తరువాత వరుస సినిమాలు చేస్తూ అలరించింది. ఇక తెలుగుతో పాటు తమిళ్, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసింది ఈమె.

ముఖ్యంగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన నరసింహ సినిమాలో ఆయన కూతురిగా కనిపించి ఒక్కసారిగా ఫెమౌస్ అయ్యింది.

ఇక 2002లో దర్శకుడు హరిని పెళ్లి చేసుకున్న ఈ వయ్యారి కంప్లీట్ గా ఫ్యామిలీకి అంకితం అయ్యింది ఈ చిన్నది.

అప్పట్లో ప్రీతీ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.. ఈమె క్యూట్ నెస్, స్మైల్ , కొంటె చూపులతో బాగా ఆకట్టుకుంది.