TV9 Telugu

బాలీవుడ్‌కు పయనమైన ప్రగ్యా జైస్వాల్.! అందుకోసమేనా.?

08 April 2024

స్టార్ ఇమేజ్ లేకపోయినా తమ గ్లామర్ తో, కొత్త ఫోటోషూట్స్ తో ప్రేక్షకులు ఆకర్షించేలా చేస్తున్నారు నేటితరం హీరోయిన్స్.

అందులో మొదటి వరసలో ఉంటారు హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. ఇప్పటికే పెద్ద హీరోలతో నటించిన స్టార్ ఇమేజ్ మాత్రం రాలేదు.

కంచె, అఖండ లాంటి సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. ఇప్పుడు రూట్ మార్చారు.

తాజాగా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌కు వెళ్తున్నారు. దీనికి టాలీవుడ్ అవకాశాలు తగ్గటం కూడా ఒక కారణం అని టాక్.

స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా.. ముదస్సర్ అజీజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని టి సిరీస్ నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా ప్రగ్యా జైస్వాల్ ను ఎంపిక చేసినట్టు బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

వెండితెర మీద గ్లామర్ ప్లస్ టాలెంట్‌తో ప్రూవ్ చేసుకున్న ఈ బ్యూటీ బాలీవుడ్ లో అయినా దూసుకుపోతుంది ఏమో చూడాలి.

అయితే సినిమాల ఎలా ఉన్న నెట్టింట మాత్రం ప్రగ్యా జోరు నెట్టింట మాత్రం హాట్‌నెస్‌ ఓవర్‌లోడెడ్ అనిపిస్తున్నారు.