18 November 2023

లండన్ పిక్స్ షేర్ చేసిన బ్యూటీ పూజా హెగ్డే.

చాలా మంది సక్సెస్‌ని సీజన్స్ తో పోలుస్తుంటారు. కొత్త సీజన్‌ పలకరించిన ప్రతి సారీ.,

ఓ హిట్‌ కూడా అలా షేక్‌ హ్యాండ్‌ ఇస్తే ఎంత బావుంటుంది అని అంటుంటారు.

పూజా హెగ్డే లైఫ్‌ కూడా ఒకప్పుడు అలాగే కలర్‌ఫుల్‌ సీజన్లుగా సాగేది. 

కానీ ఇప్పుడు సీజన్లు కాదు కదా, కేలండర్లలో ఏళ్లకు ఏళ్లు మారినా కోరుకున్న హిట్‌ దక్కడం లేదు. 

కెరీర్‌లో పీక్స్ అంటే 2017 నుంచి 2021 వరకు అని మళ్లీ మళ్లీ గుర్తుచేసుకుంటారు పూజా హెగ్డే.

అప్పట్లో ఏ స్టార్‌ హీరో సినిమా అనౌన్స్ అయినా, వెంటనే హీరోయిన్ల లిస్టులో పూజా హెగ్డే పేరు ఫస్ట్  వినిపించేది.

ఆ టైమ్‌ మళ్లీ ఎప్పుడొస్తుందా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు మేడమ్‌ పూజ.

ఆ రేంజ్‌ సినిమా మళ్లీ ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూస్తున్నారు మిస్‌ హెగ్డే.