ఆ క్యూట్ స్మైల్ ని చాల మిస్ అవుతున్నాం.. నివేదా థామస్ న్యూ ఫొటోస్.
Anil Kumar
03 September 2024
తెలుగు లో నివేదా థామస్ తెలియాలి వాళ్ళు లేరనే చెప్పాలి.. తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది నివేదా థామస్.
అందాల భామ నివేదా థామస్ తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.!
టాలీవుడ్ లో హీరో నాని తో జెంటిల్ మేన్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఆ తరువాత..
నిన్ను కోరి, జై లవకుశ, జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్, 118, బ్రోచేవారెవరురా సినిమాల్లో వరుసగా నటించి మెప్పించింది.
ఆ తర్వాత తమిళ్ లో రజినీకాంత్ నటించిన దర్భార్ సినిమాలో ఆయన కూతురిగా నటించి మెప్పించింది ఈ వయ్యారి భామ.
ఈ మధ్య అందాల భామ నివేదా థామస్ కొంత గ్యాప్ తరువాత తన కొత్త సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.!
రానా దగ్గుబాటి నిర్మాతగా తెరకెక్కనున్న ’35’ అనే సినిమాలో నివేదా నటించింది. ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు.
తాజాగా నివేదా షేర్ చేసిన ఫొటోస్ చూసి.. చాల రోజుల తరువాత ని నవ్వు చూస్తున్నాం అంటూ కామెంట్స్ చేస్తునారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి