TV9 Telugu

25 January 2024

బ్యాడ్మెంటన్‌ ఛాంపియన్‌ అదరగొట్టిన హీరోయిన్ నివేదా పేతురాజ్.

తెలుగు తెరపై అందం, అభినయంతో అలరించిన హీరోయిన్లలో నివేదా పేతురాజ్ ఒకరు.

మెంటల్ మదిలో కథాకనాయికగా పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.

ఈ బ్యూటీకి తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. అటు తమిళంలోనూ వరుస ఆఫర్స్ అందుకుంటూ..

ఇంకో పక్క ఓటీటీలోనూ వరుసగా వెబ్ సిరీస్, చేస్తూ బిజీగా లైఫ్ లీడ్‌ చేస్తోంది నివేదా.

అంతేకాదు ఈ మధ్యలో.. తాజాగా బ్యాడ్మెంటన్‌ ఛాంపియన్‌గా నిలిచి.. అందర్నీ షాక్ అయ్యేలా కూడా చేసింది.

ఈ ఫీట్‌తో నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పటికే ఎఫ్ 1 కార్ రేసర్గా, ఫార్ములా కార్ రేసింగ్ లో పలు పతకాలు సాధించిన ఈ బ్యూటీ..

ఇప్పుడు బ్యాడ్మింటన్ ఛాంపియన్ గా కూడా నిలిచి అందర్నీ షాక్ అయ్యేలా చేసింది.

తమిళనాడులో జరిగిన స్టేట్ లెవల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో మధురై తరుపున డబుల్స్ ఆడి విన్నర్ గా నిలిచింది.