TV9 Telugu

ఆ హీరోయిన్‌కు బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ అంటే మాటలా మరి.!

18 April 2024

ఒక పక్క కల్కి మూవీతో బిజీగా ఉన్న డార్లింగ్.. మరోపక్క రాజాసాబ్ షూటింగ్ సైలెంట్ గా కంప్లీట్ చేస్తున్నారు.

డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో.. ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న సినిమా రాజా సాబ్‌. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

హార్రర్ కామెడీ జోనర్ లో వస్తోన్న ఈ మూవీ లో మాళవికా మోహనన్ అండ్ నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ సినిమాతో ఒకప్పటి డార్లింగ్ మాస్, యాక్షన్ కాకుండా ఈసారి తనదైన కామెడీతో కంబ్యాక్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటి వరకు.. లవ్ , మాస్ సినిమాలు చేసిన మొట్టమొదటి సారి తనదైన కామెడీతో నవ్వించేందుకు రెడీ అయ్యారు ప్రభాస్.

ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ జరుగుతుంది.. తాజాగా సెట్లోకి తాజాగా హీరోయిన్ నిధి అగర్వాల్‌ ఎంట్రీ ఇచ్చారు.

ప్రభాస్, నిధి అగర్వాల్ కాంబోలో వచ్చే సీన్స్ చిత్రీకరించారు. కానీ దీనిపై ఎలాంటి ఆఫీషియల్ అప్డేట్ లేదు.

ఈ మూవీ తెలుగు, తమిళంతోపాటు పాన్ ఇండియా గా రిలీజ్ చేయనున్నట్లు టాక్.త్వరలోనే రాజాసాబ్ అప్డేట్స్ వస్తుందని సమాచారం.