TV9 Telugu
లాంగ్ గ్యాప్ తరువాత మళ్లీ వస్తున్న అంటూన్న ఇస్మార్ట్ బ్యూటీ నభా.
08 April 2024
అనుకోని ప్రమాదంతో మూడేళ్ళుగా సినిమాలకు దూరంగా ఉన్నారు నభా నటేష్. ఈమె మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్‌లో బిజీ అవుతున్నారు.
ఈ మధ్యే ప్రియదర్శితో ఓ సినిమాకు సైన్ చేసిన ఈమె.. తాజాగా నిఖిల్ పాన్ ఇండియా సినిమా స్వయంభులో అవకాశం అందుకున్నారు.
యాక్సిడెంట్ తర్వాత మళ్ళీ సెట్ లోకి అడుగు పెట్టారు ఈమె. నభా నటేష్ సెట్స్‌లోకి వస్తున్న వీడియోను విడుదల చేసారు మేకర్స్.
సుదీర్ బాబు హీరోగా నటించిన నన్ను దోచుకుందువటే సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది హీరోయిన్ నభా నటేష్.
ఇస్మార్ట్ శంకర్ తర్వాత నభా నటేష్ కు వరస ఆఫర్స్ క్యూ కట్టాయి. కానీ సరైన హిట్ మాత్రం ఒక్కటీ పడలేదనే చెప్పాలి.
2022లో నభా నటేష్‌కి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సందర్భంగా ఆమె ఎడమ చేతికి, ఎడమ భుజానికి గాయాలయ్యాయి.
యాక్సిడెంట్ జరిగినట్టు సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది నభా.. తాజాగా కోలుకొని తాజా ఫొటోస్ తో మళ్లీ ఫామ్ లోకి వస్తుంది.
ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఈ ముద్దుగుమ్మ నటిస్తున్న సినిమాలపై ఈమె అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి