TV9 Telugu
ఏంటి హీరోయిన్ మానుషి.. అంత మాటనేశారేంటి.?
21 March 2024
మానుషి చిల్లర్ అనే పేరు ఈ మధ్య వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వేలంటైన్ సినిమాతో బాగా పాపులర్ అయింది.
వరుణ్‌తేజ్ హీరోగా నటించిన సినిమా ఆపరేషన్ వేలంటైన్ లో మానుషి చిల్లర్ హీరోయిన్ గా తన అందంతో మెప్పించింది.
ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయ్యిన ఈ సినిమా సక్సెస్ కాకపోయినా పెద్దగా ఫీలవడం లేదట అమ్మడు మానుషీ చిల్లర్.
తన కెరీర్ కోసం నిత్యం ఎంతో మందిని కలుస్తున్నానని, అవకాశాల వస్తూనే ఉంటాయి అంటున్నారు మానుషీ చిల్లర్.
అంతే కాదు, ఆ ప్రయాణంలో మరింత నేర్చుకోవడం మీద మాత్రమే ఎక్కువ కాన్‌సెన్‌ట్రేట్ చేస్తారట ఈ ముంబై సుందరి.
ఒడుదొడుకులు ఎదురైనా, ఫ్లాప్‌లు వచ్చినా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, నేర్చుకోడానికి ఎంతో ఉంది అంటున్నారు.
ఇంకా బోలెడంత కెరీర్ కనిపిస్తోందని, ఈ టైమ్‌లో చిన్న చిన్న వాటికి కుంగిపోవడం కరెక్ట్ కాదన్నది మానుషి మాట.
మన బెస్ట్ ఇవ్వగలిగిన ప్రతిసారీ ఆత్మసంతృప్తితో నిద్రపోతామని, ఈ జీవితానికి అది చాలని అనుకుంటానని చెబుతున్నారు మానుషి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి