వాట్ ఏ క్యూట్ అమ్మడు.. సైలెంట్ గా హిట్స్ కొడుతూ రూఫ్ ఆడిస్తుందిగా..

Anil Kumar

27 August 2024

నాని హీరోగా, విజయ్ దేవరకొండ ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది కేరళ కుట్టి మాళవిక నాయర్.

తర్వాత కల్యాణ వైభోగమే, మహానటి, ట్యాక్సీవాలా, థ్యాంక్యూ వంటి చిత్రాలలో నటించి తనదైన మార్క్ తో ఆకట్టుకుంది.

చేసిన కొన్ని చిత్రాలతోనే నటిగా ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు పొందింది.

ఆ తరువాత వచ్చిన ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి, అన్ని మంచి శకునములే వంటి చిత్రాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి.

తాజాగా మాళవిక కన్నడ స్టార్‌ హీరో గణేష్‌ తో కృష్ణం ప్రణయ సఖి చిత్రంలో నటించి బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అందుకుంది.

కామెడీ నేపథ్యంలో వచ్చి మంచి విజయం అందుకున్న ఈ చిత్రాన్ని 'దండుపాళ్యం' ఫేమ్ శ్రీనివాసరాజు తెరకెక్కిచారు.

స్కిన్ షోకి దూరంగా ఉంటూ నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లోనే నటిస్తూ.. ప్రేమకథలే చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

సోషల్ మీడియాలో సైతం ఈ అమ్మడి ఫాలోయింగ్ వేరే లెవల్.. క్యూట్ ఫొటోస్ షేర్ చేస్తూ యూత్ ని ఆకట్టుకుంటుంది.