50 ఏళ్ల వయసులో.. ముచ్చటగా 3వ సారి ప్రేమలో పడిన మలైకా.!
Anil Kumar
28 July 2024
బాలీవుడ్ వయ్యారి మలైకా అరోరా ఎప్పుడూ వృత్తిపరంగా కాకుండా, వ్యక్తిగత జీవితం వల్ల వార్తల్లో నిలుస్తుంది.
మలైకా కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సల్మాన్ ఖాన్ సొదరుడు అర్భాజ్ ఖాన్ ను పెళ్లి చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
పెళ్లైన 19 ఏళ్ల తర్వాత తన భర్త అర్బాజ్ ఖాన్‌తో మలైకా విడాకులు తీసుకుని.. అర్జున్ కపూర్ తో ప్రేమలో పడింది.
అదే సమయంలో వారి ఇద్దరి వయసు వ్యత్యాసం గురించి అనేక ట్రోలింగ్స్ జరగ్గా.. తమదైన శైలిలో స్పందించారు మలైకా.
కానీ ఇప్పుడు వీరిద్దరూ విడిపోయారనే టాక్ నడుస్తుంది. ఓవైపు నెట్టింట బ్రేకప్ వదంతులు చక్కర్లు కొడుతుండగా..
ఓ మిస్టరీ మ్యాన్‌తో దిగిన ఫోటోను పోస్ట్ చేసింది మలైకా. దీంతో ఈమె మూడోసారి ప్రేమలో పడినట్లు టాక్ నడుస్తుంది.
దానికి.. ‘ప్రతి ఆనందం ప్రేమపూర్వకమైన పదం ప్రతి చర్య మన ఆత్మ సౌందర్యానికి ప్రతిబింబం.’ అంటూ మలైకా పోస్ట్ చేసింది.
50 ఏళ్ల వయసులో ముచ్చటగా మూడో సారి ఈమె పక్కాగా ప్రేమలో పడిందనే కామెంట్ కాస్త తెగ సోషల్ మీడియాలో వస్తోంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి