ఈ బ్యూటీ స్పర్శ తగిలనిదే అందానికి విలువ ఉండదు..

TV9 Telugu

23 June 2024

27 జూలై 1990న దేశ రాజధాని ఢిల్లీలో పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించింది 33 ఏళ్ళ వయ్యారి భామ కృతి సనన్.

ఈ ముద్దుగుమ్మ తండ్రి రాహుల్ సనన్ చార్టర్డ్ అకౌంటెంట్, తల్లి గీతా సనన్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలో భౌతికశాస్త్ర ప్రొఫెసర్.

ఢిల్లీ పట్టణంలోని R. K. పురంలో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో పాఠశాల విద్యను అభ్యసించింది ఈ అందాల తార.

నోయిడాలో జేపీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందింది.

నటి కావడానికి ముందు కొంతకాలం మోడల్‌గా పనిచేసింది ఈ వయ్యారి. ఈమె చెల్లెలు నుపుర్ సనన్ కూడా ఒక హీరోయిన్.

2014లో తెలుగు సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ 1: నేనొక్కడినేలో మహేష్ బాబుకి జోడిగా సినీ అరంగేట్రం చేసింది.

2015లో నాగ చైతన్యకి జోడిగా దోచెయ్ చిత్రంలో నటించింది. తర్వాత ఎన్నో బాలీవుడ్ హిట్ చిత్రాల్లో కథానాయకిగా కనిపించింది.

2023లో ప్రభాస్ రామునిగా కనిపించిన ఆదిపురుష్ సినిమాలో సీత పాత్రలో మూడోసారి తెలుగు సినిమాలో కనిపించింది.