పెళ్లి తరువాత కూడా కియారా స్పీడ్ ఏ మాత్రం తగ్గలేదుగా..

Anil Kumar

15 July 2024

ఆ మధ్య టాలీవుడ్ లో ఏ సినిమా స్టార్ట్ అవుతుందన్నా హీరోయిన్‌గా కియారా అద్వానీ పేరు ముందుగా వినిపించేది.

ఆమె పెళ్లి చేసుకుని సెటిల్‌ కావడంతో ఆ చప్పుడు కాస్త తగ్గింది అనే చెప్పుకుంటున్నారు ఇండస్ట్రీలో పలువురు.

విజయ్‌ సినిమా గ్రేటెస్ట్ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌ (గోట్‌)లో స్పెషల్‌ సాంగ్‌కి కియారాను అప్రోచ్‌ అయ్యినట్టు టాక్ ఎలాగో ఉంది.

దానికి తోడు తారక్‌ - ప్రశాంత్ నీల్‌ సినిమాలో హీరోయిన్‌గానూ క్యూట్‌ కియారానే ఫైనల్‌ చేశారన్నది టాక్‌.

బాలీవుడ్ లో ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో పాటు హృతిక్‌ - తారక్‌ వార్‌2కి కూడా కమిట్‌ అయ్యారు ఈ బ్యూటీ.

ఇప్పుడు సౌత్‌లో రామ్ చరణ్ గేమ్‌ చేంజర్‌ మూవీ ఎలాగూ సెట్స్ మీదుంది. ఈ సినిమా అప్డేట్స్ కూడా వస్తున్నాయి.

ఇక కెజిఎఫ్ - రాకీ భాయ్‌ అలియాస్ యష్‌ తదుపరి మూవీ టాక్సిక్‌లో కూడాను హీరోయిన్ గా కియారానే అంటున్నారు.

వీటికి తోడు ఈ అమ్మడు ఫొటోస్ తో సోషల్ మీడియాలో చేసే హడావుడికి అందరి కళ్ళు ఈ అమ్మడి మీదేఉంటాయి.. నో డౌట్.