కీర్తి సురేష్ బుగ్గలు ఇష్టమంటున్న స్టార్ హీరో కొడుకు
Phani CH
02 AUG 2024
మలయాళీ ముద్దుగుమ్మ అయిన తెలుగు వాళ్ల హృదయాల్లో చోటు సంపాదించుకుంది. మహానటి సినిమాతో నేషనల్ అవార్డు ఈమెను వరించింది.
ప్రస్తుతం తెలుగు, తమిళం సహా పలు చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇక ఇన్నేళ్ల కెరీర్‌లో ఈమె ఆస్తుల విలువ కూడా అదే రేంజ్‌లో పెరిగాయినేది ఇన్ సైడ్ టాక్.
తెలుగులో కీర్తి సురేష్ ఫస్ట్ మూవీ 'నేను శైలాజా'. రామ్ పోతినేని హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో తెలుగు ఆడియన్స్‌కు దగ్గరయ్యింది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాని తో తన ఫ్రెండ్షిప్, నాని కొడుకు తనను ఏమని పిలుస్తాడు వంటి సీక్రెట్స్ రివీల్ చేసింది.
నాని, తన వైఫ్, వాళ్ళ కొడుకు అందరూ నాకు చాలా క్లోజ్. ఇప్పుడైతే వాడు కొంచెం పెద్దయ్యాడు. చిన్నప్పుడు నన్ను తన గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేవాడట.
ఒకసారి నా బర్త్ డే కి వాడు ఒక వాయిస్ నోట్ పంపించాడు కాస్త డౌన్ గా ఉన్నప్పుడు ఆ వాయిస్ నోట్ వింటాను. అది సేవ్ చేసి కూడా పెట్టుకున్నాను.
నన్ను వాడు అత్త అని పిలుస్తాడు. వాడు మిస్ యూ, సి యూ అనే పదాలు భలే క్యూట్ గా పలుకుతాడు. నన్ను మూసీ, సూయు అంటాడు.
నేను ఇంటికి వెళ్లిన ప్రతిసారి నా బుగ్గ కొరికేంతలా ముద్దు పెడుతుంటాడు జున్ను అని తెలిపింది కీర్తి సురేష్.