TV9 Telugu

ఇకపై స్టార్స్ కనిపించరా.? కంగనా కామెంట్స్.

30 March 2024

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్‌ సినిమాలతో కంటే కంట్రీవర్సీలతోనే ఎక్కువా పాపులర్ అనడంలో నో డౌట్.

బాలీవుడ్ ఇండస్ట్రీ పైనే ఆమె షాకింగ్ కామెంట్స్ చెయ్యడమే కాకుండా అక్కడి స్టార్ హీరోలను కూడా వదిలిపెట్టలేదు ఆమె.

తాజాగా మీడియాతో మాట్లాడిన ఈ అమ్మడు మరోసారి స్టార్ యాక్టర్స్ గురించి మాట్లాడింది. ప్రస్తుతం ఓటీటీ హావ నడుస్తుంది.

అందుబాటులో ఉన్నఎన్నో ఓటీటీ సంస్థలు కొత్త నటీనటులకు మంచి అవకాశాల్ని ఇస్తున్నాయని అన్నారు నటి కంగన రనౌత్‌.

అయితే ఓటీటీలు మాత్రం నటీనటుల్ని స్టార్స్ గా తీర్చిదిద్దలేదు అని చెప్పుకొచ్చారు. ఎందుకో కూడా వివరణ ఇస్తూ..

తనకు తెలిసినంత వరకు చివరి తరం స్టార్స్ తామేనని.. ఓటీటీ ద్వారా స్టార్స్ అవ్వడం కష్టమన్నరు ఈ బాలీవుడ్ క్వీన్.

సినిమా రంగంలో ఫ్లాపులు చూడని స్టార్స్ ఎవరూ లేరని, ఏదో ఒక టైం లో తప్పక అది చూస్తారు అని గుర్తుచేశారు.

తాను కూడా కెరీర్‌లో ఒడుదొడుకుల్ని ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చిన కంగన రనౌత్‌.. 2024 లోక్ సభ ఎలక్షన్స్ లో పాల్గొననున్నారు.