TV9 Telugu

06 January 2024

'నీలి సైట్లలో నా ఫోటోలు' జాన్వీ కపూర్ నిజాలు.

జాన్వీ కపూర్.. అతిలోక సుందరి శ్రీదేవీ వారసురాలిగా.. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

బాలీవుడ్‌లో వరుస సినిమా ఛాన్సులతో దూసుకుపోతూ..  స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది.

త్వరలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాలో.. టాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇవ్వనుంది జాన్వీకపూర్.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన స్కూల్ డేస్‌లో ఎదురైన చేదు సంఘటనల గురించి అందరితో పంచుకుంది.

15 ఏళ్ల వయసులో స్కూల్‌ డేస్‌లో తన మార్ఫింగ్ ఫోటోలను నీలి సైట్లలో చూసి షాకయ్యా అంటూ ఎమోషనల్ అయింది.

అంతేకాదు ఆ ఫోటోల కారణంగా తన స్కూల్‌ ఫ్రెండ్స్‌కు పెద్ద జోక్‌గా మారిపోయానంటూ ఫీలైంది.

వాళ్లు నేరుగా తన మొఖం పై కామెంట్స్ చేయడంతో ఎంతో బాధకలిగేదని, స్కూల్ మానేయాలని కూడా అనిపించేదని చెప్పింది.

కానీ ఆ బాధ నుంచి కొంత మంది ఫ్రెండ్స్ కారణంగా బయట పడ్డానంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.