ఆయన కంఫర్టబుల్‌గా ఉంచారు! ఈషా..

TV9 Telugu

08 March 2024

చిరు హీరోగా నటిస్తున్న సోసియో ఫాంటసీ విశ్వంభరకి సంబంధించి రోజుకొకరు ఎక్కడో ఓ చోట మాట్లాడుతూనే ఉన్నారు.

లేటెస్ట్ గా హీరోయిన్‌ ఈషా చావ్లా మెగాప్రాజెక్ట్ గురించి మాట్లాడారు. విశ్వంభర కోసం గత 15 రోజులుగా షూటింగ్‌ చేస్తున్నారు ఈషా చావ్లా.

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి హీరోయిన్ ఈషా చావ్లా పెద్ద ఫ్యాన్. చిరు సినిమాలు చాలా వరకు చూసేశారు ఈ బ్యూటీ.

అయినా, షూటింగ్ సమయంలో చిరు కనిపించినప్పుడు ఎదురెళ్లి గబగబా మాట్లాడటానికి మొహమాటపడ్డారట నటి ఈషా చావ్లా.

మెగాస్టార్‌ ఆమె ఇబ్బందిని గమనించి చనువుగా పలకరించారట. ఆయనిచ్చిన కంఫర్ట్ లెవల్స్ గురించి మాటల్లో చెప్పలేనని అంటారు ఈషా.

ఆ మధ్య విశ్వంభరలో తన రోల్‌ గురించి మాట్లాడుతూ పూర్తి ట్రెడిషనల్‌ డ్రస్‌లో కనిపిస్తానని చెప్పారు సురభి పురాణిక్‌.

ఇప్పుడు ఈషా చావ్లా కూడా అదే విషయాన్ని చెప్పారు. కథలో తన పాత్ర చాలా కీలకమైన సందర్భంలో వస్తుందని, ట్రెడిషనల్‌ డ్రెస్‌లో కనిపిస్తాననీ అన్నారు.

అంతకు మించి కేరక్టర్‌ గురించి ఇప్పుడేమీ చెప్పలేనన్నది ఈషా మాట. విశ్వంభరలో త్రిష కథానాయకిగా నటిస్తున్నారు.