గెహనా సిప్పీ.. చేసిన రెండు సినిమాలకే యూత్ లో ఫుల్ క్రేజ్..

Anil Kumar

13 May 2024

టాలీవుడ్ లో కొత్త హీరోయిన్స్ జోరు మాములుగా లేదు.. నచ్చితే తెలుగు ఆడియన్స్ ఇచ్చే క్రేజ్ నెక్స్ట్ లెవల్ అంతే.

అదే లిస్ట్ లో చేరిపోయారు ముంబాయి కి చెందిన వయ్యారి భామ గెహనా సిప్పీ.. ప్రస్తుతం ఈమె వయస్సు 23 ఏళ్ళు.

ఆకాష్ పూరి హీరోగా నటించిన 'చోర్ బజార్' సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ వెండితెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.

ఆ తరువాత జబర్దస్త్ సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన గాలోడు సినిమాలో నటించి తనదైన శైలితో మెప్పించింది గెహనా.

ఏమైందో తెలియదు కానీ.. ఈ రెండు సినిమాల తరువాత ఈ హీరోయిన్ చెయ్యబోయే మూవీస్ పై ఎలాంటి అనౌన్స్ మెంట్ చెయ్యలేదు.

అయితే ఈ అమ్మడు ఈ రెండు సినిమాల్లోనే గ్లామర్ గేట్స్ ఓపెన్ చేసి.. క్యూట్ క్యూట్ గా కవిస్తూ మెప్పించింది.

సోషల్ మీడియా లో ఈ అమ్మడి ఫాలోయింగ్ కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈమె ఫొటోస్ కు యూత్ లో మంచి క్రేజ్ ఉంది.

నెట్టింట గెహెనా ఫుల్ యాక్టీవ్ గా ఉంటూ.. న్యూ ఫొటోస్ తో ఎప్పటికప్పుడు కుర్రకారుని ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు.