విశ్వంభరకు హీరోయిన్ లాక్.. బయోపిక్‌లో నటించాలనుందన్న లైగర్‌ బ్యూటీ..

TV9 Telugu

04 February  2024

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా బింబిసారా ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో నటిస్తున్న సోసియో ఫాంటసీ సినిమా విశ్వంభర.

వచ్చే ఏడాది సంక్రాంతి పండగ కానుకగా జనవరి 10న విడుదల చేయడానికి రెడీ అని కన్‌ఫర్మ్ చేసేశారు మూవీ మేకర్స్.

ఈ సినిమాలో చిరు పక్కన త్రిష కృష్ణన్ నటిస్తున్నారు. చెన్నై సోయగం త్రిషకు సంక్రాంతి సీజన్‌ బాగా కలిసొస్తుంది.

2004లో వర్షం, 2005లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా, 2008లో కింగ్‌, 2010లో నమో వెంకటేశా, 2012లో బాడీగార్డ్ సినిమాలతో సంక్రాంతికి ప్రేక్షకులను పలకరించారు త్రిష.

లైగర్‌ సినిమాతో సౌత్‌ ఇండస్ట్రీకి హాయ్‌ చెప్పిన బ్యూటీ అనన్య పాండే. తన మూవీస్‌తో కాకుండా, బోయ్‌ఫ్రెండ్‌తో వెకేషన్లకు వెళ్తూ ఎక్కువగా పాపులర్‌ అయ్యారు ఈ బ్యూటీ.

చేతినిండా సినిమాలున్నాయని, అయినా తనకు బయోపిక్స్ మీద మనసు మళ్లుతోందని అంటుంది బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే.

ఇటీవల ప్రిన్సెస్‌ డయానా అనే బయోపిక్ సినిమా చూశానని, అప్పటి నుంచీ ఈ కోరిక మొదలైందని అంటుంది అనన్య పాండే.

మధుబాలా, జీనత్‌ అమన్‌, వహీదా, రేఖా బయోపిక్స్ సినిమాల్లో తనను తాను చూసుకోవాలని ఉందని అంటుంది అనన్య పాండే.