అందాలతో అరాచకం చేస్తున్న వావ్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా.

Anil Kumar

15 june 2024

'ఫరియా అబ్దుల్లా'.. జాతిరత్నాలు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ టాలీవుడ్ టాలెస్ట్ ముద్దుగుమ్మ.

ఈ సినిమాలో అమాయకంగా నటించి ప్రేక్షకులను మెప్పించిన ఫరియా.. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది.

ఆతర్వాత ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. దాంతో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిరల్ సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించింది. అలాగే స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. 

బంగార్రాజు సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో నాగార్జున, నాగ చైతన్యతో కలిసి స్టెప్పులు అదరగొట్టింది ఈ బ్యూటీ.

ఆతర్వాత తిరిగి హీరోయిన్ గా రాణించాలని చూస్తూ.. రవితేజతో రావణాసుర సినిమా చేసింది. కానీ ఈ సినిమా హిట్ అవ్వలేదు.

తాజాగా అల్లరి నరేష్ తో ఆఒక్కటి అడక్కు అనే సినిమా చేసింది. కానీ ఈ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది.

ఇదిలా ఉంటే ఈ అమ్మడు గ్లామర్ గేట్లు ఎత్తేస్తుంది. నెట్టింట అందాలు ఆరబోస్తూ చేసిన ఫోటో షూట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.